Hot Widget

Ticker

6/recent/ticker-posts

తమిళనాడులో ఉన్న కుంభకోణానికి ఆంగ్లంలో స్కామ్‌ని కుంభకోణం అనడానికి సంబంధం ఏమిటి?

 కుంభకోణానికి మోసానికి పర్యాయ పదంగా పేర్కోవడానికి ఒక చారిత్రాత్మక విశేషం ఉంది.. ఈ కథని గరికపాటి గారు "సాహిత్యంలో హాస్యం" అనే కార్యక్రమం లో వివరించారు.. మీరు సరిగ్గా గమనిస్తే కుంభకోణం అనే పదాన్ని స్కామ్ గా మన తెలుగు వారే వ్యవహరిస్తారు..

అప్పట్లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు , కుంభకోణం పట్టణం "ఇత్తడి " పరిశ్రమ కి ప్రఖ్యాతి గాంచిందట .. మన తెలుగు వారు ఇళ్లల్లో పెళ్లిళ్లు, లేదా ఇతర శుభకార్యాలు ఉంటె, ఇత్తడి సమన్లు కొనడం కోసం, సుదూర తెలుగు ప్రాంతాల నుంచి కుంభకోణానికి 5 రోజులు ప్రయాణం చేసి మరీ వెళ్ళేవారుట..

అయితే భాష రాకో , మరే కారణం చేతనో, మన తెలుగు వారికీ నాసిరకం ఇత్తడి సామాన్లు అంటగట్టేవారుట అక్కడి వారు.. అంత దూరం ప్రయాణం చేసి, అటువంటి వస్తువులను తెచ్చారు కనుక, అని ఆ కుటుంబ పెద్ద ఇంట్లోవాళ్ళు తిట్టేవారుట.. ఆ నాసిరకం సామాన్లను " కుంభకోణం సరుకు " అని వ్యవహరించడం మొదలుపెట్టారట.. తర్వాత కాలంలో దానినే స్కామ్ కి పర్యాయ పదంగా మారిపోయింది..

ఇదండీ కుంభకోణం కథ..ప్రస్తుతం మాత్రం కుంభకోణం అంటే స్కామ్ కాదండోయ్ , దేవాలయాల నగరం.. నాడీ జ్యోతిష్యానికి కూడా ప్రఖ్యాతి గాంచిన ఊరది.. 😀